Friday, March 20, 2026

*కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయుత* ——————————————–

నేటి సాక్షి – జగిత్యాల(పూరెళ్ల బాపు)……………………………………..బ్రతుకు దెరువు కోసం కొండగట్టుకు వచ్చి చిన్న దుకాణాల్లో బొమ్మలు, గాజులు, పిల్లలకు ఆట వస్తువులు అమ్మి జీవనోపాది పోందుతున్న కుటుంబాలు కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రులైన వారికి మెము సైతం ఉన్నామంటు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు, మరియు అనుబంధ హోల్ సేల్ వ్యాపారస్తులు చేయూత అందజేశారు, లేడీస్ ఎంపోరియం అసోసియేషన్ సంఘం అద్యక్షులు దీటి అజయ్య పటేల్ ఆద్వర్యంలో 8 కుటుంబాలకు మరియు మిగతా 15 కుటుంబాలకు లేడీస్ ఎంపోరియం అసోసియేషన్ జగిత్యాల తరఫున వారికి నిత్యవసర వస్తువులు అందజేశారు.దాదాపు 8 కుటుంబాలకు దుప్పట్లు, రగ్గులు, బెడ్ షీట్స్, కీ”శే”చెవుల రాజలింగయ్య పటేల్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సబ్యులు అందించారు.జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం ద్వారా భారత్ క్లాత్ సారి సెంటర్ కటుకం అమర్నాథ్ గారు ఆ కుటుంబాలకు 23 చీరేలు అందజేసారు.ఈ కార్యక్రమంలో లేడీస్ ఎంపోరియం అసోసియేషన్ సంఘం అద్యక్షులు దీటి అజయ్య పటేల్, గౌరవ అద్యక్షులు కొత్తపెల్లి నాగభూషణం, గాజుల మల్లికార్జున్, కోట శ్రీనివాస్, మరియు ఊటూరి శ్రీదర్, నీలి వేణుమాధవ్, కైలాష్ పతి అజీజ్ నూరి, కొక్కుల రమేష్, శ్రీనివాస్ బి శ్రీనివాస్, మల్లన్న, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News