Wednesday, March 18, 2026

*కొండగట్టు ఆలయ భూములు అంజన్న కే చెందాలి* *విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ్ రాధాకృష్ణ రెడ్డి డిమాండ్*——————————————

నేటి సాక్షి – జగిత్యాల(పూరెళ్ల బాపు)…………………………………….జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయం భూములు ఆంజనేయస్వామికే చెందాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర గోశాల సంపర్క ప్రముఖ్ ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి, జగిత్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు బోయినిపెల్లి పద్మాకర్ లు అన్నారు. *ఈ సందర్బంగా రాధాకృష్ణ రెడ్డి, పద్మాకర్ లు మాట్లాడుతూ* గత కొంత కాలంగా ఫారెస్ట్ అధికారులు దేవాలయ భూములనీ మార్కింగ్ చేశారని, ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ దేవాలయం ఈవో అనుమతి లేకుండా భూములు చుట్టూ మార్కింగ్ చేశారని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.శనివారం యాగండ్ల లక్ష్మీనారాయణ, ముదిగంటి రాజారెడ్డి, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్ లు కొండగట్టు ఆంజనేస్వామి ఆలయం ముందు ఆలయ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టగా కరీంనగర్ నుండి రాధాకృష్ణ రెడ్డి హాజరయ్యారు.ఆ భూములన్ని దేవాలయానికి చెందాలని, అదేవిధంగా కొండ చుట్టూ గిరి ప్రదర్శన చేసే భక్తులపై కొంతమంది హేళన చేయడం క్షమించారానిదన్నారు.హిందువులను హేళన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ రెడ్డి అధికారులను కోరారు.అనుమతి లేకుండా హద్దులు పెట్టినటువంటి అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఏవైతే ఫారెస్ట్ అధికారులు మార్కింగ్ చేసిన భూములు దేవాలయాలకు చెందే విధంగా చూడాలన్నారు.అలా చేయకపోతే ఈ దీక్షను రాష్ట్రవ్యాప్తంగా చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News