Monday, March 16, 2026

*కొండగట్టు గిరి ప్రదక్షిణకు అపూర్వ స్పందన**కార్తీకపౌర్ణమి సందర్బంగా వేలాదిమంది పాల్గొన్న భక్తులు*——————————————-జగిత్యాల –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………………ప్రతి పౌర్ణమికి కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తుండగా కార్తీకపౌర్ణమి పురస్కరించుకొని బుధవారం గిరిప్రదక్షిణలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లానుండే కాకుండా హైదరాబాద్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా గిరి ప్రదక్షిణకు అపూర్వస్పందన లభించింది.జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటే కోరినకోర్కెలు తిరుతాయని భక్తుల నమ్మకం.బుధవారం జరిగిన ప్రదక్షిణను హైదరాబాద్ లోని చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి ప్రారంభించి ప్రవచనం చేశారు.కొండగట్టు అంజన్న ఆశీర్వాదం తోనే భక్తుల గిరిప్రదక్షిణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందన్నారు.కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు క్యారంగుల అరుణ, వేముల కేశవరెడ్డి, ఎన్. ఉమా, కే.దివ్య,బి. రాజు, కే. పద్మ, గండ్ర మల్లారెడ్డి,సంకిటి రవీందర్ రెడ్డి, ,బాపు,శ్రీకాంత్, జనార్దన్, గిరిదర్, సచిన్, హన్మంత్ రెడ్డి, వేణు తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News