Saturday, March 21, 2026

*కొండగట్టు ప్రమాద బాధితులకు వర్తక సంఘం చేయూత**నగదు, బట్టలు, సామాగ్రి అందజేత*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………ఛాంబర్ ఆఫ్ కామర్స్ (వర్తక సంఘం) జగిత్యాల, హోల్సేల్ అండ్ రిటైల్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు మంగళవారం ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల డిఎస్పి రఘు చందర్ హాజరై బాధితులకు బట్టలు,వంట సామాగ్రీ అందజేశారు.డీఎస్పీతో పాటు వర్తక సంఘం అధ్యక్షులు కమాటల శ్రీనివాస్, ఉటూరి నవీన్ లు, వర్తకులు బాధితులను పరామర్శించి వారికి అండగా జగిత్యాల వర్తకులు ఉంటారని అభయమిచ్చి సర్వము కోల్పోయి నిరాశ్రయులైన ఎనిమిది కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున నగదు డిఎస్పి చేతుల మీదుగా అందజేశారు. అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30 కుటుంబాలకు ఒక లక్ష రూపాయల విలువగల బట్టలు, స్టీలు సామాగ్రి అందజేయడం జేశారు.*ఈ సందర్భంగా కమాటాల శ్రీనివాస్, నవీన్ లు మాట్లాడుతూ* ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని, మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరారు.ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలని, స్థానిక అవసరాలకు స్థానిక వ్యాపారులు మాత్రమే పెద్ద మనసుతో సహకరిస్తారని, కార్పొరేట్ వ్యాపార సంస్థలు లాభార్జన ధ్యేయంగా పనిచేస్తాయని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని వారు పేర్కొన్నారు. *ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల డివిజనల్ పోలీస్ అధికారి రఘు చందర్ మాట్లాడుతూ* జగిత్యాల వర్తక సంఘం వారు, వారి అనుబంధ భాగస్వామ్య సంఘాల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున బట్టలు తదితర సామాగ్రి అందరికీ అందజేయడమే కాకుండా నగదు రూపేనా కూడా పూర్తిస్థాయిలో నిరాశ్రయులైన ఎనిమిది కుటుంబాలకు ఆర్థికంగా సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ , జగిత్యాల జిల్లా ఏజెన్సీస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వూటూరి నవీన్, జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు శీల శ్రీనివాస్, ఇత్తడి అండ్ స్టీల్ వ్యాపారుల సంఘ కార్యదర్శి ఉప్పుగండ్ల రవీందర్ , గరిపెల్లి సంపత్ కుమార్, జిల్లా రంజిత్ భోనగిరి వాసు (ఫర్టిలైజర్స్), అయిండ్ల రాజిరెడ్డి, సూర రంజిత్, కోటగిరి సంజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News