Thursday, March 12, 2026

కొండ్రోని పల్లి గ్రామం బీటి రోడ్డు పనులు వెంటనే చేపట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తాంబీటి రోడ్డు పనులు చేపట్టాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్

నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 16, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కోండ్రోన్ పల్లి గ్రామంలో బీటీ రోడ్డు పనులు చేపట్టాలంటూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి కొండ్రంపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు అటు విద్యార్థులు గ్రామస్తుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వివరించారు పలుసార్లు మండల స్థాయి. జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన చేపట్టడం లేదని ఆయన విమర్శించారు.. లాల్కోట క్రాస్ రోడ్డు నుండి పూసలపాడు కొండ్రంపల్లి కోటూరు గ్రామాలకు వెళ్లే రహదారి కంకర తేలి గుంతలు ఏర్పడి వాహనదారులు నానా ఇబ్బందులకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కొండ్రంపల్లి బీటీ రోడ్డు గుంతలమయం కావడంతో కొండ్రంపల్లి గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు కూడా బందు కావడం జరిగిందని ఆయన వివరించారు. అటు మూడు గ్రామాల రైతులకు ప్రజలకు విద్యార్థులకు రాకపోక సౌకర్యాలకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొండ్రంపల్లి లాల్కోట పూసలపాడు వెళ్లే బీటీ రోడ్డు పనులు చేపట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామన్నారు. పలుసార్లు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఈ రోడ్డు విషయంపై విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. కొండ్రంపల్లి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుపై జిల్లాస్థాయి అధికారులు స్పందించకపోతే. మూడు గ్రామాల రైతుల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో కొండ్రంపల్లి గ్రామస్తులు గ్రామం మాజీ సర్పంచ్ నర్సింలు, బాలరాజు, శాంతన్న, అబ్దుల్ హమీద్, మోహన్ రాజు, రామప్ప, పద్మా రెడ్డి, రాజప్ప, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News