Tuesday, March 17, 2026

కొటాలగూడ గ్రామ సర్పంచ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బచ్చంగారి శ్వేత సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్.హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు.

నేటి సాక్షి వికారాబాద్:వికారాబాద్ జిల్లా మండల పరిధిలో నీ కోటాల గూడ గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బచ్చం గారి శ్వేత,ఈసందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించి, పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు నా శుభాకాంక్షలు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే బాధ్యత సర్పంచ్ లపై ఉంటుంది.ఇప్పుడు గెలిచిన సర్పంచ్ లు అదృష్టవంతులు, రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన నడుస్తూ ప్రజారంజక పరిపాలన జరుగుతున్నది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇప్పుడు పదవిలో ఉన్న సర్పంచ్ ల ద్వారా అమలవుతాయి కాబట్టి మీకు మంచి పేరు వస్తుంది.వికారాబాద్ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు జరిగితే, 105 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కూడా సర్పంచ్ లుగా గెలిచారు.ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ లుగా విజయం సాదించారంటే దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు మాపై ఉన్న నమ్మకం, విశ్వాసం.గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన అప్పులకు నెలకు 6500 కోట్ల రూపాయలు మిత్తి కడుతూ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు.రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ కరంటు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, నూతన ఉద్యోగాలు భర్తీ చేయడం, ఇందిరమ్మ ఇళ్ళు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.ఇంకా కొన్ని హామీలు పెండింగ్ లో ఉన్నాయి.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు చక్కబడగానే ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం సహాయం, మహిళలకు ఆర్ధిక భరోసా, కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు ఇచ్చిన ఇతర హామీలను కూడా అమలు చేస్తాం.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిగుళ్ల పల్లి రమేష్, మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిలారం మల్లేష్, కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News