నేటి సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కళాశాలలో బుక్ బేరర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనో టైపిస్ట్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, కోడింగ్ క్లర్క్స్ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సబ్ స్టాఫ్/ సూపర్‌వైజర్, టైలర్, టెలిఫోన్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, వ్యాన్ డ్రైవర్, కార్పెంటర్, అటెండర్, బార్బర్, సబ్ ఆర్డినేట్ సిబ్బంది, డార్క్ రూమ్ అసిస్టెంట్, ధోబీ, ల్యాబ్ అటెండెంట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, రికార్డ్ క్లర్క్/రికార్డ్ అసిస్టెంట్/స్టోర్ కీపర్, వార్డు బాయ్ వంటి తదితర 155 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తులను పాల్వంచ పట్టణంలోని జిల్లా ఉపాధి కల్పన (ఎస్-27 ఐడిఒసి) కార్యాలయంలో ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ లోపు సమర్పించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.