Tuesday, March 17, 2026

*కొత్తపల్లి మండలంలోని,ఎదురుపాడు గ్రామ “ప్రభుత్వ ఎంపీపీ స్కూల్ కు దారి చూపెట్టండి. సమతా సైనిక్ దళ్.నాయకుడు సగినాల.. సురేష్ విద్యార్థులతో కలిసి, దారి చూపాలని వేడుకుంటున్న సమతా సైనిక్ దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల.సురేష్… కొత్తపల్లె నవంబర్ ఎదురుపాడు

నేటి సాక్షి :- కొత్త పల్లి మండలంలోని, వెదురుపాడు గ్రామంలో ఉన్న “ప్రభుత్వ ఎంపిపి స్కూలుకు రాస్తా చూపించండి మహా ప్రభు” అని విద్యార్థులతో కలిసి సమతా స్థానిక దళ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల సురేష్, మండల అధ్యక్షుడు నేరేడు పుల్లయ్య, తదితర నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ మూడు అడుగుల రోడ్డులో స్కూలుకు పిల్లలు ఎలా పోతారని సమతా సైనిక్ దల్ సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల.సురేష్, కొత్తపల్లి మండలం అధ్యక్షుడు నేరేడు.పుల్లయ్య పగిడిమాన్.రవి, పగిడిమాన్ బాలేసు, నేరేడు.బాబు నేరేడు.వీరన్న లు ఖండించారు. గత ఐదారు సంవత్సరాలగా ఈ స్కూలుకు రాస్తా లేదని విషయంపై ప్రజా సంఘాలు స్పందించి మండల అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా, అధికారుల వైఖరి నిర్లక్ష్యంతో ఉందని పాఠశాలకు ఇంతవరకు రస్తా చూప లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఎదురుపాడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు త్వరగా రస్తా ఏర్పాటు చేయకపోతే సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో, అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృత చేస్తామని సగినాల.సురేష్ నేరేడు.పుల్లయ్య లు అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News