నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ÷అన్నమయ్య జిల్లా -:- మదనపల్లి జిల్లా కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య కలెక్టరేట్ అధికారులతో కళకళలాడుతోంది. గురువారం ఉదయం కలెక్టరేట్ కు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావులు కార్యాలయాలకు హాజరయ్యారు. వారిని కలవడానికి జిల్లాలోని 25 మండలాల నుంచి అన్ని శాఖల అధికారులు కలెక్టరేట్ కు వచ్చారు. కలెక్టర్, జేసీ, డిఆర్ఓలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 2026 జనవరి 1 సందర్బంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచిపెట్టి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు..~~~~~~~~~~~~~~~~~

