నేటిసాక్షి : జగదేవ పూర్ అక్టోబర్ 23రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మండల నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,స్థానిక మాజీ సర్పంచ్ కరుణాకర్, వివిధ పార్టీల అధ్యక్షులు నాయకులు బుద్ధ నాగరాజు, యూత్ అధ్యక్షులు గణేష్ గౌడ్, గాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,అమర రాము, శ్రీనివాస్ రెడ్డి ,అజిస్,మహేష్, చిరంజీవి, బచ్చలి భాస్కర్, బింగిమల్లేశం,ఆంజనేయులు గౌడ్,మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏ ఈ ఓ ఖలీల్, పిఎసిఎస్ సి ఓ రాములు, సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, మల్లేశం, బాలరాజు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.





