నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండలంలోని వడ్లు కొనుగోలు కేంద్రాలని సిపిఐ నాయకులు గురువారం రోజున పరిశీలించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే వరి కోతలు మొదలై కేంద్రాలకు వడ్లు వస్తున్నాయని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు . రైతుల దగ్గర దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారని తునికలా కొలతలు శాఖ అధికారు ల పర్యవేక్షణ కరువు అయింది అని ఎవ్వరైనా పిర్యాదు చేస్తే తప్ప పట్టించుకోరు అని ప్రతీ గ్రామం లో అధికారులు పర్యవేక్షణ చేయాలనీ అన్నారు రైతులకు టార్పాలిన్లు వడ్లు పట్టే జల్లెడ మంచినీటి వసతులు కల్పించాలి అని అన్నారు అకాల వర్షాలు ఉన్నందున రైతు లకు దళారులు చెప్పిన రేటుకె ఇస్తున్నారు. అని ప్రభుత్వం చోరువా చూపి మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ అన్నారు. తూకం లో అవకాతవకలు లేకుండా చూడాలి అని అన్నారు. రా కార్యక్రమంలో మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతలా అంజిరెడ్డి మండల సహాయ కార్యదర్శి కూన మల్లయ్య గన్నేరు వారం సిపిఐ కార్యదర్శి బోయిని మల్లయ్య సహాయ కార్యదర్శి బొమ్మకంటి అంజయ్య చారిఎండీ నాయిమ్ దామా సంపత్ కాంతలా విజేందర్ రెడ్డి పబ్బతి మల్లారెడ్డి కాంతలా నర్సింహా రెడ్డి కూనా నర్సయ్య కాంతలా కొండల్ రెడ్డి తాటికొండ రాజు పండుగ రవీందర్ రెడ్డి కాంతలా రాజిరెడ్డి కోర్వి చెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.





