నేటి సాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):* ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులపై ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి, జంగపల్లి, హన్మాజీపల్లె, గోపాల్ పూర్, మాదాపూర్, గన్నేరువరం గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల పనితీరును సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సీజన్ లో వరిధాన్యం దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్లాలని, తద్వారా ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి గన్నేరువరం మండల వ్యవసాయ అధికారి జె.కిరణ్మయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,కేడీసీసీ డైరెక్టర్ అలువాల కోటి, పార్టీ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, జువ్వడి మన్మోహన్ రావు, లింగాల మల్లారెడ్డి, చిట్టి ఆనంద్ రెడ్డి, మాతంగి అనిల్, పాకాల పరశురాం,రజాక్ తదితరులు పాల్గొన్నారు.





