Friday, March 20, 2026

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లపోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 10రేపు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ నితిక పంత్, ఐపీఎస్ సిర్పూర్ యు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రతా చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఎస్పీ నితిక పంత్ అక్కడ విధుల్లో ఉన్న ఆర్ ఐ విద్యాసాగర్, ఎస్‌ఐ రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది తో మాట్లాడి ఎన్నికల సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, ప్రలోభాలు లేదా బెదిరింపులకు తావు లేకుండా కట్టుదిట్టమైన పహారా నిర్వహించాలి. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిధిలో 163 BNSS అమలులో ఉన్నందున, నలుగురికి మించి వ్యక్తులు ఉండకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. ఏదైనా గొడవల కారణమైతే పోలీసు వారిని నేరుగా శ్రప్పదించాలని ఫోన్ చేయాలని వారు సూచించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News