నేటి సాక్షి,కొమురం భీమ్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా వార్షిక నేర నివేదిక (Annual Crime Report) పత్రిక సమావేశాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీమతి నితిక పంత్, ఐపీఎస్ గారు పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో 2025 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాలు, నమోదైన కేసుల వివరాలు, నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీస్ శాఖ చేసిన కృషిని వివరించారు.ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలమని, చట్టసువ్యవస్థల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. భవిష్యత్లో నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కాగజనగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, సీఐలు, ఎస్ఐలు మరియు వివిధ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

