- కొల్చారం మండలంలో..మచ్చలేని నాయకుడు…
- కొల్చారంలోని ……చురకమైన పాత్ర పోషించిన రంగంపేట….. ధర్మగౌడ్…. నేటి సాక్షి ,మెదక్. ( భూమయ్య):-
రాజకీయ చరిత్రలోనే
కొల్చారం మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు హయాంలోదాదాపు 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన గోకని ధర్మాగౌడ్ అంటేనే ఒక ధర్మాత్ముడు. అతనికి అవినీతి, అన్యాయం అనే రాజకీయం లేకుండా పెద్దచదువులు చదవకున్నా కూడా తనదైన శైలిలో రంగంపేట గ్రామంలో మొట్టమొదటి ఎస్సీ, బీసీ కాలనీ, శివాజీనగర్ బస్ స్టాండ్ ఏరియా కాలనీ, బుడగ జంగంకాలనీలకు శ్రీకారం చుట్టి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతితో నిజాయితీగా తనదైన శైలిలో గ్రామ వార్డు సభ్యుడుగా,ఉప సర్పంచ్, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, కొల్చారం మండలం వైస్ ఎంపీపీగా నిజాయితీగా పేదల పక్షాన నిలబడి ప్రజా అభ్యున్నతేదేంగా ప్రముఖవ్యాపార కేంద్రమైన రంగంపేటలో మొట్టమొదటిసారిగా మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ధర్మ గౌడ్ సొంత స్థలాన్ని ఇచ్చి హాస్పిటల్ కట్టించారు. రంగంపేట గ్రామంలో 60 వేల లీటర్ల సామర్థ్యం గల ఊరికి సరిపడే విధంగా వాటర్ ట్యాంక్ నిర్మించిన ఘనత ఆయనదే,80 సంవత్సరాల వయసు దాటిన ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి రంగంపేట గ్రామానికి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన వేళ అదే సమయంలో అమెరికా నుండి వచ్చిన ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, తండ్రి మైనంపల్లి హనుమంతరావు రామాయంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన తరుణంలో పక్షాన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని కొనసాగించి గెలిపించిన నాయకుడు గోకని ధర్మ గౌడ్, ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు ఆయన పదవుల్లో ఉన్న అంతకాలం ప్రతి కుటుంబాన్ని మేలుకోరుతూ గ్రామాని కవన్నెతెచ్చిన మహానుభావుడు ఇప్పుడున్న రాజకీయాల్లో పట్టి చూస్తే అతను మేధావి, తనకు తానే సాటి, ప్రాణం మించిపనిచేసిన నాయకుడు రంగంపేటలోనే లేడు. అనడానికి మార్గదర్శకుడు. గ్రామానికి ఒక నిదర్శనం ఒక రూపాయి ఆశించకుండా పనిచేసి ధర్మగౌడ్ ఆదర్శంగా నిలిచారు. ధర్మగౌడ్ ఆత్మ శాంతి చేకూరాలని స్వర్గ ప్రాప్తి పొందాలని రంగంపేట ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కాముని శ్రీనివాస్,పద్మ బిక్షపతి నేత, వంజరి ఆంజనేయులు, గాండ్ల కృష్ణ, బండి నాగయ్య, ఉసికె బిక్షపతి, పిఎస్పీఎస్ అటెండర్ తదితరులు ఆయనకు ఘనంగా నివాళు లర్పించారు.
- మైనంపల్లి హనుమంతరావుకు..
ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తండ్రి మైనంపల్లి హనుమంతరావు గతంలో రామాయంపేట అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కొల్చారం మండలంలో టిడిపి నుంచి ప్రచారంలో చురకైన పాత్ర పోషించిన నాయకుడు గోకని ధర్మ గౌడ్. అలాగే టిడిపి పార్టీ నుంచి కొల్చారం మండలం అంసన్ పల్లి గ్రామానికి చెందిన దేవర వాసుదేవారావు కూడా టిడిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. అప్పట్లో కూడా కొల్చారం మండలంలో టిడిపి పార్టీకి పూర్వ వైభవం తెచ్చి ఎన్ని ఆటంకాలు ఎదురైనా మచ్చలేని నాయకునిగా, కొల్చారం మండలంలో మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్న నాయకుడు ధర్మ గౌడ్ అని చెప్పుకోవచ్చు.
- టిడిపి మాజీ మంత్రి కరణం రామ్ చందర్రావుకు అత్యంత సన్నిహితుడు గోకుని ధర్మగౌడ్ తెలుగుదేశం పార్టీ నుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగ పనిచేసిన కరణం రాంచందర్రావుకు గోకని ధర్మగౌడ్ అత్యంత సన్నితుడుగా ఉండేవాడు. అలాగే కర్ణం రామచంద్రా రావు సహాయంతో కొల్చారం మండలానికి వివిధ కార్యక్రమాలు చేపించిన ఘనత గోకనిధర్మ గౌడ్ కు దక్కుతుంది. మండలంలో వివిధ గ్రామాలలో కూడా వాటర్ ట్యాంకులు సిసి రోడ్లకు పంచాయతీల శాఖ మంత్రిగా ఉన్న కరణం రామచంద్ర సహాయంతో కొల్చారం మండలానికి పనులు చేశారు.
- కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జైపాల్ కు అత్యంత సన్నిహితుడు ధర్మ గౌడ్…. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గామని జైపాల్ కు రంగంపేట మాజీ సర్పంచ్ గోకని ధర్మ గౌడ్ పాత్రికేయుడు గామని జైపాల్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవాడని జర్నలిస్ట్ జైపాల్ తెలిపారు. అంతేకాకుండా అప్పట్లో కొల్చారం మండలంలో అప్పట్లో కొల్చారం మండలానికి సుమారు ముగ్గురు మంది విలేకరులు ఉండేవారని జైపాల్ తెలిపారు. మండల అభివృద్ధి కోసం పనిచేసిన గోకని ధర్మ గౌడ్ కు ” జర్నలిస్టు జ్వాల ” ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ గామని జైపాల్ గోకని ధర్మ గౌడ్ కు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు.