కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా.కుల్చారం. నేటి సాక్షి వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. కొల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి రిజిస్టర్, సిబ్బంది హాజర పట్టిక , మందుల స్టాక్ రిజిస్టర్ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎల్లవేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





