Sunday, March 15, 2026

*కోటి సంతకాల సేకరణలో చురుగ్గా పాల్గొనాలి..!*-అనుపల్లి పంచాయతీ యువతకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచన..

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకరణ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టే కోటి సంతకాల సేకరణలో చురుగ్గా పాల్గొనాలని చంద్రగిరి నియోజక వర్గం పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీకి చెందిన పలువురు పార్టీ నేతలు, యువకులు ఆదివారం తుమ్మల గుంటలోని చెవిరెడ్డి నివాసంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోటి సంతకాల సేకరణలో ఆలస్యం చేయడానికి వీలు లేదని, గ్రామ స్థాయిలో ఒక్కరికీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే ఇబ్బందులను ప్రతి ఒక్కరికీ తెలియపరచి సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని యువత ఉత్సాహంతో విజయవంతం చేయాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News