మునగాల కోదాడ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం, డబ్బులు పంచుతున్నారని తీవ్ర ఆరోపణలు వెలుగులోకి రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి జరగడం పెద్ద సంచలనం సృష్టించింది. మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే ప్రయత్నంగా ఈ ఘటనను రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.ఈ ఘటనపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా డబ్బులు, మద్యం రాజకీయాలు చేస్తున్నారని, అక్రమాలను బయటపెడుతున్న మీడియాపై దాడులు చేయడం ప్రజాస్వామ్య గొంతుని నొక్కివేయడమేనని మండిపడ్డారు. అలాగేమీడియాపై దాడి అంటే కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యంపై యుద్ధం ప్రకటించినట్టే అన్నారు.డబ్బు, మద్యం రాజకీయాలతో ఓట్లు కొనాలనుకునే వారికి కోదాడలో స్థానం లేదు అని గట్టిగా హెచ్చరించారు.జర్నలిస్టులను బెదిరించే గుండాలు చట్టం ముందు నిలబడక తప్పదు అని తెలిపారు.అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలి హెచ్చరించారు. కోదాడ మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోతే కోదాడలో భారీ ఉద్యమాలకు బిఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధికారులను గట్టిగా హెచ్చరించారు.





