నేటి సాక్షి (భూమయ్య )కోనాపూర్ గ్రామస్తులు గాడిదలు.. వాటిని మేపడానికే గ్రామానికి వచ్చా అంటూ కొల్చారం ఎంపీ ఓ కృష్ణవేణి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన సోమవారం కొల్చారం మండలం కోనాపూర్లో සñයි. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామంలో పారిశుద్ధ్య సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి గ్రామానికి రావడం లేదు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పని చేయడం లేదు. దీంతో గ్రామంలో మురుగు కాలువలు చెత్తతో నిండుకపోయి రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తూ ఇండ్లలోకి మురుగునీరు వస్తుంది. దీంతో గ్రామసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కరించకపోవడంతో సోమవారంగ్రామస్తులు పంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు. కార్యాలయంవిషయం తెలిసిన ఎంపీడీవో రఫిక్ ఉనిస్తా బేగం గ్రామానికి వెళ్లి సమస్య తెలుసుకోవాలని సమస్య పరిష్కరించాలని ఎంపీఓ కృష్ణవేణి ఆదేశించారు. దీంతో గ్రామానికి ఎంపీఓ కృష్ణవేణి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది అప్పటికి పంచాయతీ కార్యాలయాన్ని సిబ్బంది కానీ పంచాయతీ సెక్రటరీ గానీ తెరవలేదు. పంచాయతీ కార్యదర్శి మహేష్ గ్రామస్తులకు గాని అధికారులకు గాని ఫోన్లో అందుబాటులో లేడు. ఎవరికి అందుబాటులో లేని సెక్రటరీ తో ఎలా పని చేయిస్తారని గ్రామస్తులు ఎంపీ ఓను నిలదీయడంతో గ్రామస్తులపై ఎంపీ ఓ కృష్ణవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు గాడిదలు వాటిని వేపడానికి నేను గ్రామానికి వచ్చా అని గ్రామస్తులపై ఎంపీఓ ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ఎంపీఓపై తిరగబడ్డారు.లు దీంతో సంగాయిపేట తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు కార్యదర్శులు సదాశివుడు ప్రశాంత్ జోక్యం చేసుకొని గ్రామస్తులను శాంతింప చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వారం రోజుల్లో గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా చూడన ట్లు గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఎంపీఓ కృష్ణవేణి పంచాయతీ సంగయ్యపేట తుక్కాపూర్ సంగయ్యపేట తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో తిరిగి గ్రామంలో సమస్యలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రంగంపేట సహకార సంఘం ఉపాధ్యక్షులు మోత్కు మల్లేశం, మాజీ సర్పంచ్ రమేష్, బి ఆర్ఎస్ నాయకులు బండి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి మల్లేశం గ్రామస్తులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.





