నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )*అక్రమంగా మూసిన నాలా – మున్సిపాలిటీ జోక్యం*కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డులో నాలాను అక్రమంగా మూసివేసి నిర్మాణ పనులు చేపట్టిన ఘటనలో, మున్సిపల్ కార్యాలయం అధికారులు మోఖపై వెళ్లి పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టారు. మొరం వేసి పూర్తిగా మూసివేసిన నాలాను తొలగించి పాతస్థితికి తీసుకువచ్చారు. అలాగే బఫర్జోన్లో అనుమతి లేకుండా నిర్మించిన బేస్మెంట్ను కూడా అధికారులు కూల్చివేశారు.*అనుమతి లేకుండా కట్టడాలు నిషేధం* – కమిషనర్ హెచ్చరికకోరుట్ల పట్టణంలో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని మున్సిపల్ కమిషనర్ స్పష్టం చేశారు. 2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ కట్టడాలను ఎటువంటి సూచన లేకుండానే తొలగించే అధికారం మున్సిపాలిటీకి ఉందని గుర్తుచేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు సహకరించాలని కోరారు._____





