Wednesday, March 18, 2026

*కోరుట్లలో గుండెపోటుతో యువకుడి మృతి**

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్లలో గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ఇటీవలి కాలంలో ఉన్నచోటే కుప్పకూలి మరణించే ఘటనలు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.శుక్రవారం అర్ధరాత్రి కోరుట్ల పోచమ్మవాడకు చెందిన పిల్లి రాజు (34) ఇంట్లో బాత్రూం కోసం వెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతునికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉండగా, రాజు ఆకస్మిక మరణంతో ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. స్థానికులు కుటుంబానికి సాంత్వన తెలిపారు.___

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News