నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )సంక్రాంతి సమీపిస్తున్న సందర్భంగా కోరుట్ల పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు దుకాణాలపై దాడులు చేసి పెద్ద మొత్తంలో నిషేధిత చైనామాంజాను స్వాధీనం చేసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి మాంజా విక్రయించిన ఉప్పుగల యశ్వంత్ (20), సిరిపురం శ్రీకాంత్ (36) అనే ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసి ఉపయోగించినా లేదా ఆ మాంజా కారణంగా ఎవరైనా గాయపడినా సంబంధితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిషేధిత మాంజా ప్రాణాలకు ఋప్రమాదకరమని, ఎక్కడైనా విక్రయం జరుగుతున్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుట్ల ఎస్ఐ ఎం. చిరంజీవి ప్రజలను విజ్ఞప్తి చేశారు.—-

