Friday, March 13, 2026

*కోరుట్లలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం*—* పాత వంట నూనె వినియోగంపై ఫిర్యాదు* స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల్లో పాత నూనె పునర్వినియోగమంటూ ఆరోపణలు* మున్సిపల్ కమిషనర్‌కు మహమ్మద్ ముజాహిద్ వినతి పత్రం* చాయ్ హోటళ్లలో గ్లాసులు సరిగా శుభ్రం చేయడంలేదని విమర్శలు—-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలో కొన్ని స్ట్రీట్ ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లలో పాత వంట నూనెను పలుమార్లు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సమాజవాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.*పాత నూనె వినియోగంపై ఫిర్యాదు*కోరుట్ల పట్టణంలో కొన్ని స్ట్రీట్ ఫుడ్ విక్రేతలు, టిఫిన్ సెంటర్లలో ఒకే వంట నూనెను మూడు నుండి నాలుగు రోజుల వరకు మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నారని సమాచారం అందిందని సమాజవాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఈ అంశంపై కొరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్‌తో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.*ప్రజల ఆరోగ్యానికి ముప్పు*పునర్వినియోగం చేసిన వంట నూనె ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరం కావచ్చని, దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రజలతో మాట్లాడినప్పుడు ఈ విషయంపై పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.*చాయ్ హోటళ్లలో పరిశుభ్రత లోపం*ఇదే సందర్భంలో తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలోని కొన్ని చాయ్ హోటళ్లలో గ్లాసులను సరిగా శుభ్రం చేయకుండా కేవలం నీటితో కడిగి మళ్లీ వినియోగిస్తున్నారని ఆరోపించారు. అలాగే పట్టణంలో కల్తీ పాలు తయారీ కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని ఎంపీజే కోరుట్ల ఉపాధ్యక్షులు ఎం.ఏ. బారీ కోరారు. పట్టణంలో ఆహార పరిశుభ్రతపై కఠిన తనిఖీలు చేపట్టాలని స్థానికులు కూడా కోరుతున్నారు._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News