Monday, March 16, 2026

*కోరుట్లలో ‘మోచి-నాయి బ్రాహ్మణ’ సంఘాల భవనాలకు నిధులు*——–* నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కృతజ్ఞతలు——*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని రెండు వృత్తుల సంఘాలకు కేంద్ర నిధులతో అభివృద్ధి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కోరుట్ల పట్టణ మోచి సంఘ భవన నిర్మాణ పనులకు రూ.3 లక్షలు, నాయి బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణ పనులకు మరో రూ.3 లక్షలు మంజూరు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కి సంఘాల సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.*అరవింద్ అభివృద్ధి పథంలో ముందుకు*( డా. రాచకొండ యాదగిరి బాబు )ఈ రెండు భవనాల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను కార్తీక పౌర్ణమి రోజున కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ వద్ద జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ఏ పార్లమెంటు సెగ్మెంట్ లో లేని అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవింద్ చేపట్టారన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి నిధులు కేటాయిస్తూ ముందుచూపుతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కోరుట్ల పట్టణానికి నవోదయ పాఠశాల మంజూరు కావడం ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు.*స్థానిక నేతల సమిష్టి భాగస్వామ్యం*ఈ భవనాల నిర్మాణం పూర్తవడంతో రెండు వృత్తిజీవి సంఘాల కార్యకలాపాలకు స్థిరమైన వేదిక లభించనుందని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమాల్లో కోరుట్ల బీజేపీ పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎలేటి నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కస్తూరి లక్ష్మీనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్, గిన్నెల శ్రీకాంత్, మేకల గణేష్, రాగంశెట్టి సాయి కృష్ణ, కొండ్లెపు రాజేంద్రప్రసాద్, అలాగే మోచి సంఘం మరియు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News