నేటి సాక్షి, కోరుట్ల టౌన్*(గణేష్ గొల్లపల్లి)బిసి లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదించాలని, వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలో బిఈసి జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ లో భాగంగా శనివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, దుకాణాలను, బస్సులను బంద్ పెట్టించారు. అనంతరం కార్గిల్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు తెలంగాణలో సకుటుంబ సర్వే నిర్వహించి, ఆ గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ 42% అమలయే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు, కేంద్రానికి పంపించిన పిమ్మట కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, దానికి తెలంగాణలో ఉన్నటువంటి బిజెపి 8 మంది పార్లమెంట్ సభ్యులు సహకరించాలన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కుల సంఘాల నేతలందరినీ కలుపుకొని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనీ కలవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు జరపాలని, విద్యా ఉద్యోగ అవకాశం కల్పించాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను నిలుపుదల చేయాలని, హైకోర్టులో బలంగా బీసీ వాదనను వినిపించాలని కోరారు. బిసి రిజర్వేషన్ 42 శాతం వచ్చేంతవరకు ఇదేవిధంగా బీసీ వర్గాలు పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. ఈరోజు రవాణా, వ్యాపార,వాణిజ్య దుకాణ, హోటల్ పాఠశాలలు, స్వచ్ఛందంగా మూసివేసి బంద్ లో పాల్గొన్నందుకు కమ్యూనిస్టు పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండి ముక్రం, అన్నం రాదా, రామిళ్ళ రాంబాబు, మొహమ్మద్ అలీ, చాంద్ పాషా, సిపిఐ ఎమ్మెల్ న్యూ డ్రామా కసి నేత చింత భూమేశ్వర్, గంగాధర్, సిపిఐ ఎం నేత కొంచెం శంకర్, ఎల్లా పోషన్న, గోపాల్, సుశీల తదితరులు పాల్గొన్నారు.




