నేటి సాక్షి – కోరుట్ల* ( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సప్త శనివార వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు శ్రద్ధాభక్తులతో వ్రతంలో పాల్గొని స్వామివారి కృప పొందారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడంతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.___





