Monday, February 23, 2026

*కోరుట్ల ‘డి-40’ కెనాల్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం** మేడిపల్లి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తింపు—*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మామిడి రాజ్‌కుమార్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కోరుట్లలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.—-*ఇంటి నుంచి వెళ్లి..శవమై దొరికి..*ఈనెల 21న మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో రాజ్‌కుమార్ తన తల్లిని మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన వద్ద డబ్బులు లేవని తల్లి చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన రాజ్‌కుమార్ తిరిగి ఇంటికి రాలేదు.కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదని సమాచారం.*కెనాల్‌లో మృతదేహం… ఆధార్ ఆధారంగా గుర్తింపు*ఈనెల 23న మధ్యాహ్నం సుమారు 1 గంటల సమయంలో కోరుట్ల పట్టణంలోని ‘డి-40’ కెనాల్ వద్ద మృతదేహం ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.మృతుడి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు రాజ్‌కుమార్ అని గుర్తించినట్టు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.మృతుడి తల్లి భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఘటనకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు.ఈ సంఘటనతో మేడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News