నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల నియోజకవర్గంలోని 2766 మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2 కోట్ల 58 లక్షల వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం అయిలాపూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులు పంపిణీ చేశారు.*మహిళా సంఘాలకు ప్రభుత్వం అండ*జగిత్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక వినూత్న పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, పాఠశాల యూనిఫాం కుట్టు పనులు మహిళా సంఘాలకు అప్పగించడం, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని కొనియాడారు. వడ్డీ లేని రుణాల పథకం గురించి మహిళలందరికీ అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.*మహిళలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి*ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామీణ మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా-మండల-గ్రామ సమాఖ్య సభ్యులు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.____





