నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత–గంగాధర్ తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు భారీగా కదం తొక్కాయి.*జువ్వాడి రత్నాకర్ రావుకు నివాళి*ర్యాలీకి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగ్ రావు, సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు. ముందుగా కోరుట్ల పట్టణ వెటర్నరీ కళాశాల ఆవరణలో ఉన్న స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.*ఉత్సాహభరితంగా బైక్ ర్యాలీ*అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి నంది చౌక్, కొత్త బస్టాండ్, డైమండ్ హోటల్ మార్గంగా తిరిగి కొత్త బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ జెండాలతో పట్టణం కిక్కిరిసింది.*ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం.!*ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుని కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలలో జెండా ఎగరవేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, అందులో భాగంగానే తిరుమల వసంత–గంగాధర్‌ను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశామన్నారు.*ఇక..ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలపై దృష్టి.!రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గ్రామాల నుండి వచ్చి కౌన్సిలర్ల గెలుపు కోసం శ్రమించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గెలుపోటములు సహజమని, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత–గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ అహద్, కౌన్సిలర్లు శీలం జయలక్ష్మీ–వేణుగోపాల్, పుప్పాల ఉమాదేవి–ప్రభాకర్, దాసరి సునీత–రాజశేఖర్, ఎడ్ల జలజ, రమేష్, రెంజర్ల కళ్యాణి, తెడ్డు శ్రీజ–విజయ్, ఉమేరా కౌసర్, వాసిద్, సనా సుల్తానా–రిజ్వాన్, మేడిపల్లి శిరీష–శేఖర్ రెడ్డి, చిట్యాల లక్ష్మీనారాయణ, తోట గంగాధర్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, అబ్దుల్ రహీం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం, వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు._____

