నేటి సాక్షి – కోరుట్ల*(రాధారపు నర్సయ్య)కోరుట్ల పట్టణంలోని ‘ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్’ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు చిలువేరి లక్ష్మీరాజం జాతీయ జెండాను ఆవిష్కరించారు.*ముఖ్య అతిథులుగా ఆ ఇద్దరు పెద్దలు.!*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ హాజరై జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం వారు పాత్రికేయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కీలకమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అలాగే స్థానిక ఎస్సై చిరంజీవి పాల్గొని, మీడియా సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు.ఈ వేడుకల్లో ‘ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్’ కార్యవర్గ సభ్యులు ముఖ్రం, కత్తిరాజ్ శంకర్, సంజీవ్, బద్రి సృజన్, శోభన్ రావు, రాజు, గణేష్, హుస్సేన్, శ్రీశైలం, రాధాకృష్ణ, మహేష్ తదితరులు, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.—-





