నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణ బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బెజ్జారపు పెద్దోళ్ల శ్రీనివాస్, కార్యదర్శిగా తొగిటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అక్కినపెల్లి వెంకటరమణ వెల్లడించారు. బులియన్ వ్యాపారుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు తెలిపారు.*అధ్యక్షుడికి ఘనసన్మానం*ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీనివాస్‌నుమాజీ జడ్పీటీసీ కాటిపెల్లి శ్రీనివాస్,బులియన్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు, ముక్కాస్ జువెలర్స్ అధినేత ముక్క రాజు,పట్టణ ప్రముఖ వ్యాపారి లింగ ఉదయ్ కుమార్ తదితరులు ఘనంగా సన్మానించారు.*వ్యాపారుల ఐక్యతకు కృషి*ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, బులియన్ వ్యాపారుల సమస్యల పరిష్కారం, వ్యాపారాభివృద్ధి, సంఘ ఐక్యత కోసం కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని కోరారు.___





