నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో తనతోపాటు కలిసి పోటీచేసి.. వారివారి వార్డుల్లో విజయం సాధించిన బీజేపీ కౌన్సిలర్లను 31వ వార్డు మాజీ కౌన్సిలర్ పెండెం గణేష్ ఘనంగా అభినందించారు.*తాను ఓటమి చెందినా.. గెలిచిన వారికి అభినందనలు.!*దురదృష్టవశాత్తు తాను విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయినా.. తనతోటి సహచరులు విజయం సాధించడంతో మంగళవారం వారిని అభినందించేందుకు ‘సుడిగాలి సత్కార యాత్ర’ చేపట్టారు పెండెం గణేష్.పార్టీ విజయానికి కృషి చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు బీజేపీ కార్యకర్తలు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.*గెలుపొందిన కౌన్సిలర్లకు అభినందనలు.!*మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లలో 5వ వార్డుకు సోరుపాక రమాదేవి-రమేష్, 7వ వార్డుకు గుగులావత్ శ్రీకాంత్, 11వ వార్డుకు కస్తూరి లక్ష్మీనారాయణ, 25వ వార్డుకు కలాల రాధ-సాయిచంద్, 27వ వార్డుకు ఇందూరి తిరుమల వాసు, 33వ వార్డుకు రుద్ర సుజాత-శ్రీనివాస్ లు విజయం సాధించారు. వీరందరికీ పెండెం గణేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విజయోత్సాహంలో భాగంగా పెండెం గణేష్ గెలుపొందిన కౌన్సిలర్లను శాలువా కప్పి సత్కరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా 31వ వార్డు బీజేపీ కార్యకర్తలు పార్టీ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణ అభివృద్ధికి బీజేపీ కౌన్సిలర్లు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.________

