Tuesday, March 10, 2026

*కోరుట్ల-మెట్ పెల్లి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్** ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి* జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్—–*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల – మెట్ పల్లి మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ గురువారం పరిశీలించారు. *సజావుగా జరుగుతోందా.?*ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అన్నిరకాల ఫామ్స్ అందుబాటులో ఉండేల చూసుకోవాలని ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, శాంతియుత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్, మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్, కోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య , రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.—

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News