నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన కోరుట్ల వాసి, అంగన్వాడీ టీచర్ మ్యాకల సాయీశ్వరికి అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ఆమె చేసిన విశిష్ట సేవలను గుర్తించి లూసియానా యూనివర్సిటీ (అమెరికా) 2026 సంవత్సరానికి గాను ప్రదానం చేసే సావిత్రిబాయి పూలే బెస్ట్ ఉమెన్ రీడర్షిప్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపిక చేస్తూ యూనివర్సిటీ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.*అంగన్వాడీ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు*కోరుట్ల పట్టణ కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న మ్యాకల సాయీశ్వరి, బాలల సంక్షేమం, మహిళా సాధికారత దిశగా ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో సేవలందిస్తున్నారు. ఆమె సేవాభావం, అంకితభావాన్ని గుర్తించిన లూసియానా యూనివర్సిటీ, సమాజంలో విశిష్ట సేవలు అందించిన మహిళలకు అందించే ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఆమెను ఎంపిక చేసింది.*ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం*సాయీశ్వరి అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతూ, అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం గత కొన్ని సంవత్సరాలుగా నిరంతర పోరాటాలు చేశారు. వేతనాలు, పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ఆమె చేసిన ఉద్యమాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.*సాయీశ్వరీకి అభినందనల వెల్లువ*సాయీశ్వరికి ఈ అంతర్జాతీయ అవార్డు లభించడంపై అంగన్వాడీ టీచర్ సంఘాల నాయకులు, సహచరులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. సాధారణ ఉద్యోగం నుంచి అంతర్జాతీయ స్థాయి గౌరవం వరకు ఆమె చేసిన ప్రయాణం అనేక మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.___

