నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్లలోని వెటర్నరీయూనివర్సిటీలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలను.. మత ప్రచారం చేయకూడదన్న అభ్యంతరాలతో భజరంగ్ దళ్, బీజేపీ నాయకులు కళాశాల డీన్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా భజరంగ్ దళ్‌కు చెందిన కల్లెడ రోహిత్ మాట్లాడుతూ..ఎలాంటి మత బోధన, మత ప్రచారం, మత కార్యక్రమం విద్యాసంస్థల్లో అనుమతించబడదు. విద్యార్థులపై మత ప్రభావం చూపే కార్యక్రమాలు జరగకూడదని స్పష్టం చేశారు.*’క్రిస్మస్’ కార్యక్రమంపై పరిమితులు*బీజేపీ మాజీ కౌన్సిలర్ మాడవేణి నరేష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఏదైనా మత ప్రచారం జరిగితే మేము ముట్టడి చేయడానికైనా సిద్ధమేనని హెచ్చరించారు.ఈ విషయంపై స్పందించిన డీన్ శ్రీనివాస్, యూనివర్సిటీలో ఎలాంటి మత ప్రచారం జరగబోదని హామీ ఇచ్చారు. అయితే పెద్దఎత్తున క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన నేపథ్యంలో, భజరంగ్ దళ్–బీజేపీ నాయకుల సూచనలతో కార్యక్రమాన్ని కేవలం కేక్ కటింగ్‌కు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపారు.నాయకులు దీనికి స్పందించి శ్రీనివాస్‌రావు గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్లెడ రోహిత్, వనతడుపుల కళ్యాణ్, రాగి రాజు, గాజుల విఘ్నేష్, మాడవేణి నరేష్ తదితరులు పాల్గొన్నారు.______




