నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోరుట్లలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకులు పాల్గొని దేశభక్తి ఉత్సాహంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*దేశభక్తి స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’*ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ—’బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది. ఈ గీతం భారతీయులలో దేశభక్తి జ్వాలలు రగిలించిన చారిత్రాత్మక గేయమ’ని పేర్కొన్నారు.విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.*విద్యార్థుల ఉత్సాహం*సామూహిక గీతాలాపనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ‘వందేమాతరం’ నినాదాలతో పాఠశాల ప్రాంగణాన్ని మార్మోగించారు.ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు వందేమాతరం గేయం యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని వివరించారు.___________





