నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: టూరిజం భూమి తీసుకొని టీటీడీ ఆ భూమిని ఒబెరాయ్ గ్రూప్ కు కట్టబెట్టడం దారుణమని టీటీడీ మాజీ చైర్మన్, ఉమ్మడి జిల్లాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కేటాయింపు జరిగిన భూమిని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిపిరికి అతి సమీపంలో భూములను కేటాయించడం జరిగిందన్నారు. డిసెంబర్ 11న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని అత్యంత వేగంగా 13న జీవో జారీ చేశారన్నారు. టూరిజం స్థలానికి ఎకరం 90 లక్షల రూపాయల విలువ ఉందన్నారు. గజం రూ.49 వేలు, ఎకరాకు 26కోట్ల రూపాయలు విలువ చేసే 20 ఎకరాలు రూ.460 కోట్ల విలువైన భూములను ఒబెరాయ్ గ్రూప్ కు టీటీడీ దోచిపెట్టిందని భూమన విమర్శించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.3వేల కోట్లకు పైగానే ఉంటుందన్నారు. కోహినూరు వజ్రం కంటే టీటీడీ స్థలానికి విలువ ఎక్కువన్నారు. వాటి విలువ వెల కట్టలేమని భూమన స్పష్టం చేశారు. టూరిజం శాఖ నుంచి టీటీడీ కేవలం రేూ.18 కోట్లకే స్థలాన్ని తీసుకుందని పేర్కొన్నారు. ఒబెరాయ్ హోటల్ లీజు డీన్ మనీని ఎందుకు మాఫీ చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. దాని వల్ల భగవంతుడికి ఇచ్చిన ఇనామ్ భూమి ప్రైవేట్ వ్యక్తులపరమైందని విమర్శించారు. శంకరయ్య సులేమాన్ అయినట్లు, ఒబెరాయ్ ముంతాజ్ హోటల్ వాళ్లకు టీటీడీ స్వరంగా మారిందని భూమన ఎద్దేవా చేశారు. మూడు వేల కోట్ల విలువైన భూమిని ఒబేరాయ్ గ్రూప్ కు తక్కువ ధరకే కట్టబెట్టారని ఆరోపించారు. 13న జీఓ జారీ చేస్తే ఇప్పటి వరకు అది ఆన్లైన్ కాకపోవడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. భూమిని డిసెంబర్ 5న రిజిష్ట్రేషన్ చేశారని అది కూడా ఆన్లైన్ లో చూపించడం లేదన్నారు. ఒబేరాయ్ గ్రూప్ కు కేటాయించిన భూమిలో ఎర్ర చందనం చెట్లు ఉన్న విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని భూమన వెల్లడించారు.వంద రూములతో 1500 మందికి ఉద్యోగాలా..—————————————-100 రూములను ఒబెరాయ్ హోటల్ నిర్మిస్తే 1500ల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోందన్నారు. అది ఎలా సాధ్యమో తనకు తెలియడం లేదన్నారు. కేవలం హోటల్ పేరు మార్చి అనుమతులు మంజూరు చేయడాన్ని తప్పుబట్టారు. పరకామణి దోపిడీ కంటే అతిపెద్ద దోపిడీగా అభివర్ణించారు. ప్రైవేట్ హోటల్స్ కు టీటీడీ స్థలం దారాదత్తం చేయడం దారుణమని తెలిపారు. దాని వల్ల టీటీడీకి రూపాయి లాభం లేదని విమర్శల వర్షం కురిపించారు. ఎవరికి మేలు చేయడానికి రూ.2 కోట్ల బిల్డింగ్ ఫీజు సర్దుబాటు చేశారని 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేశారని ప్రశ్నించారు. దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనాడు తీసుకొచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయని గుర్తు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు పెడతారానని భూమన నిలదీశారు. జిల్లా కలెక్టర్ కూడా నైతిక బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా పనులు ఎలా జరుగుతున్నాయి..——————————————-అనుమతులు లేకుండా అలిపిరి వద్ద పనులు ఎలా జరుగుతున్నాయని ఎర్ర చందనం దుంగలు ఏమయ్యాయో టీటీడీ వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. రెవెన్యూ ల్యాండ్ ఇచ్చే అవకాశమున్నా కూడా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న భూమిని ఇవ్వడం వెనుక మతలబు లేంటని భూమన ప్రశ్నించారు. స్వామీజీలు దీనిపై మౌనం వీడి పోరాటం చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.~~~~~~~~~~~~~~~~~~





