Wednesday, March 11, 2026

కౌటలలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..పదవులు శాశ్వతం కాదని పదవిలో మనం చేసిన పనులే శాశ్వతం.కౌటల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏకగ్రీవం

నేటి సాక్షి కొమరం భీమాసిఫాబాద్ ప్రతినిధి మార్చ్ 11 కొమురం భీం జిల్లా కౌటాల మండలంలో సిర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిండు కుండల మారిందని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కఅన్నారుసిర్పూర్ అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం ఎమ్మెల్సీ దండే విఠల్కౌటల మండలంలో జరిగిన పార్టీ మండల అధ్యక్ష పదవి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి ఆదిలాబాద్ డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మంతయ్య.మరియు మండలానికి చెందిన పలువురు సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ సర్పంచులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు.అంతరం రెండు మండలాల నుండి దరఖాస్తులు స్వీకరించగా కౌటల మండల పార్టీ అధ్యక్షుడుగా నీకోడే గంగారం డీసీసీ అధ్యక్షరాలు మరియు ఎమ్మెల్సీ. ఏకగ్రీవం అయినట్టు ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా కృషి చెయ్యాలని ఎమ్మెల్సీ దండే విఠల్. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అన్నారు.ప్రతి ఒక్కరు పార్టీకి కట్టుబడి ఉండాలని పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అని అన్నారు.పదవులు శాశ్వతం కాదని పదవిలో మనం చేసిన పనులే శాశ్వతం అని వారు అన్నారు._ఈ కార్యక్రమంలో కౌటల మరియు చింతలమానేపల్లి మండల తాజా మాజీ ప్రజా ప్రతినిథులు.నాయకులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News