నేటి సాక్షి 20 ఫిబ్రవరి పాములపాడు :–అన్నదాత సుఖీభవ పథకం క్రింద కౌలు రైతులకు 20వేల రూపాయలు ఇచ్చి వెంటనే కౌలు రైతులను ఆదుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి సోమన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయం దగ్గర గోడపత్రికలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23 24 తేదీలలో జిల్లా కలెక్టర్ రేట్ వద్ద జరిగే 30 గంటల దీక్షలలో కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు వ్యవసాయంలో ప్రతి ఏటా సాగు ఖర్చులు బాగా పెరిగిపోయాయని తీరా పంటలను పండించిన తర్వాత గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక వైపు ధరలు పెరుగుతూ ఉంటే మరోవైపు ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీలలో కోతలు విధిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద సంవత్సరానికి 6000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు మొత్తం 20 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అని పేర్కొన్నారు ప్రధానంగా భూమి మీద 60 శాతం మంది కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నప్పటికీ పెట్టుబడి సాయం అందకపోవడం వలన కౌలు రైతులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు దేవదాయ భూములు కౌలు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ పంటలు లేకపోవడం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట చేతికి రాక కౌలు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు రైతులు ఆత్మ హత్యలను ఎన్నోసార్లు ప్రభుత్వాలకు నివేదించిన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కోట్ల నాగేశ్వర్ రెడ్డి రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ బాలయ్య శివన్న జాన్ బాబు మక్బుల్ తదితరులు పాల్గొన్నారు

