- – మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తే గుడ్డలూడదీసి కొడతాం
- – పీసీసీ రాష్ర్ట కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ హెచ్చరిక
నేటి సాక్షి, కరీంనగర్: పాడి కౌశిక్‌రెడ్డి జాగ్రత్త.. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై అనుచిత వ్యాఖ్యలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని పీసీసీ రాష్ర్ట కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలే చేస్తే గుడ్డలు ఊడదీసి బడితే పూజ చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి పొన్నంపై పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. మంత్రి పొన్నంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కౌశిక్ .. నీవు తెలంగాణ ఉద్యమ ద్రోహివి.. తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లతో దాడి చేసిన దుర్మార్గుడివి నీవు.. పొన్నం ప్రభాకర్ తెలంగాణ వీరుడు.. తెలంగాణ కోసం ఢిల్లీలో పోరాడి పార్లమెంట్లో బిల్లు పెట్టి, తెలంగాణ సాధించిన వీరుడు పొన్నం అని అన్నారు. ఎక్కడో ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం చేసిన బూడిద టెండర్‌కు, దాన్ని తరలిస్తున్న లారీలకు పొన్నం ప్రభాకర్‌కు ఏమి సంబంధం అని ప్రశ్నించారు. నువ్వు వాడే భాష గత కొన్ని రోజుల కింద బీజేపీ నాయకుడు చేసిన ఆరోపణలే అని చెప్పారు. మీరద్దరు బ్లాక్ మెయిల్ రాజకీయ నాయకులు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నీకు.. దమ్ముంటే గత మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై చర్చకు సిద్ధమా? మీ పాలనలో దళితులపై దాడి, ల్యాండ్, సాండ్, మైనింగ్ మాఫియా మీద విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మరొకసారి మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే భౌతిక దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వసీం, ఇమ్రాన్, హరీశ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.