*నేటిసాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్):* గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు చాకలివాని పల్లె ఉపసర్పంచ్ కూన సంతోష్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత మంచి మార్గంలో నడవాలని క్రీడలతో మానసిక ఉల్లాసం మరియు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జిల్లాకు మండలానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. బోయిన్పల్లి మండలం లోని నర్సింగాపూర్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతి ఎలగందుల రెండో బహుమతి గన్నేరువరం జట్లు గెలుపొందగా ప్రజా ప్రతినిధులు క్రీడాకారులకు ట్రోఫీతో పాటు నగదు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామస్తులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

