Saturday, March 7, 2026

క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుంది…- ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి.- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక ద్రుఢత్వం లభిస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలేజ్ టూ విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.వారు మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ తెలిపారు.మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు.గతంలో విద్యార్థి దశలో ఉన్న సమయంలో కోర్టు లైన్ పోసే వాడినని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డి పోటీలు జిల్లా పరిదిలో తన వంతు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్రీడాకారులు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో మంత్రుల చేతుల మీదుగా అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిoదన్నారు..మన ప్రాంతంలో కోరుట్ల, సిరిసిల్ల,వేములవాడ ప్రాంతాల్లో క్రీడాకారులకు నూతన స్టేడియం లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ తెప్ప వద్ద క్రీడా ప్రాంగణాన్ని చూడటం జరిగిందనీ తెలిపారు..గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వేలికి తీయడానికి సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News