నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు),………………………………….జగిత్యాల పట్టణంలోని పట్టణ ఫొటో , వీడియోగ్రాఫర్స్ డిజిటల్ ఫోటో క్రియేషన్స్, వీడియో మిక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రారంభించారు.క్రీడల వల్ల స్నేహసంబంధాలు పెరు గుతాయని, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.*ఈసందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ మాట్లాడుతూ..*క్రీడల్లో గెలిచినా ఓడినా సమానమే అన్నారు. ఓటమి అనేది విజయానికి నాంది అన్నారు. ప్రతీ ఒక్కరూ స్నేహ బావాలను అలవర్చుకుంటూ క్రీడల్లో పాల్గొనాలన్నారు. ప్రతీ ఏటా ఇక్కడ క్రీ డలను నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడలను అట్టహాసంగా పూర్తి చేయాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో జగిత్యాల పట్టణ ఫొటో , వీడియోగ్రాఫర్స్ డిజిటల్ ఫోటో క్రియేషన్స్, వీడియో మిక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ, సభ్యులు, పాల్గొన్నారు.





