నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 16,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో మరికలి ఒక మండల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన క్రీడాకారులకు మరికల్ శివగంగ వాటర్ ప్లాంట్ యజమాని కస్పె సతీష్ కుమార్, శ్రీ మల్లికార్జున కురువ యువజన సంఘం ఆధ్వర్యం లో బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన క్రీడాకారులకు శాలువాలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కె.సతీష్ కుమార్,జోగు మల్లయ్య, కె. రవి, మల్లేష్,,దండు లక్ష్మయ్య, దండు ఎల్లప్ప, బీరప్ప దండు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

