నేటి సాక్షి నారాయణపేట, నవంబర్ 13,నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండల కేంద్రం లో నిర్మించ తలపెట్టిన స్టేడియం కోసం స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్న 3 ఎకరాలతో పాటు ఇంకా అదనంగా స్థలాన్ని చూడమని అధికారులని మంత్రి ఆదేశించారు. ఈ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని వారికి సూచించారు.





