Thursday, March 12, 2026

క్రీడా రంగంలో మరోసారి ప్రతిభ చాటిన పాములపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థులు. ప్రిన్సిపాల్, నాగ రవీంద్ర, ఫిజికల్ డైరెక్టర్..సాయి కృష్ణ.పాములపాడు

నేటి సాక్షి అక్టోబర్ 14:–పాములపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభతో మరోసారి గర్వించదగిన విజయాన్ని సాధించారు.ఇటీవల కర్నూల్ అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన అండర్–19 ఎస్.జి.ఎఫ్ సెలెక్షన్లలో పలు క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. *సాఫ్ట్‌బాల్‌లో, యం. జీవన్ కుమార్, *క్రికెట్‌లో*ఏ. జయంత్ ఆచారి, బాల్ బ్యాడ్మింటన్‌లో*కె. ప్రణయ్, యం. సందీప్, పి. ప్రసన్న లక్ష్మి, త్రోబాల్.లో యం. ఈశ్వర్, ఏ. అశోక్, *క్యారమ్స్‌లో కె. సంతోష్, *షటిల్‌లో కె. ప్రణయ్, యం. సందీప్, యస్. ఈశ్వర్తమ కృషి, నిబద్ధతతో ఆదర్శంగా నిలిచారు.ఈ గర్వకారణమైన విజయంపై పాఠశాల ప్రిన్సిపాల్ నాగ రవీంద్ర , ఫిజికల్ డైరెక్టర్ కె. సాయి కృష్ణ , మరియు రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు.విద్యార్థుల కృషి వెనుక ఉన్న ఆచార్యుల మార్గదర్శకత మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ విజయాలు ఆదర్శ పాఠశాల గర్వకారణమై, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి విజయాలకు పునాది వేస్తాయని ఆయన అన్నారు.”క్రీడ అంటే కేవలం గేమ్ కాదు — అది మన కృషి, క్రమశిక్షణ, సంకల్పానికి ప్రతీక” అనిపాములపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థుల రాష్ట్రస్థాయి విజయం సాధించడం తో చాలా సంతోషకరమైన విషయం అని ప్రిన్సిపాల్ నాగ రవీంద్ర చెప్పడం జరిగింది అని పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News