Monday, March 16, 2026

*క్రీస్తు బోధనలు ప్రేమ,సేవ, క్షమాపణకు ప్రాధాన్యం*

నేటి సాక్షి ,డిసెంబర్ 25. బుగ్గారం. లోక రక్షకుడు క్రీస్తు బోధనలు ప్రేమ,సేవ,క్షమాపణకు ప్రాధాన్యమిస్తాయని వేముల సుభాష్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా బుగ్గారం మండల కేంద్రంలోని జీసస్ చర్చిలో గురువారం నాడు క్రైస్తవ సోదరులతో పాటు బుగ్గారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రపంచ మానవాళికి శాంతి,ప్రేమ సేవా దృక్పథాలను బోధించాడని ఈ ప్రపంచమంతా ప్రేమమయం కావాలని కోరుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు నగునూరి నర్సగౌడ్ సర్పంచ్ నక్క రాజవ్వ,ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్, వార్డు మెంబర్లు పోచరాజు, బెజ్జారపు రాజు,పోగుల సమత తిరుపతి,దూడ సుజాత క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News