Tuesday, January 20, 2026

*క్షతగాత్రులకు సత్వర సేవలు అందించాలి* •108 అంబులెన్స్ జిల్లా మేనేజర్ కుమారస్వామి

నేటి సాక్షి, ధర్మారం (జనవరి 20) : అత్యవసర సమయంలో ఉన్న క్షతగాత్రులకు సత్వర సేవలు అందించాలని 108 అంబులెన్స్ పెద్దపల్లి జిల్లా మేనేజర్ జంపాల కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ వాహనాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ లోని వైద్య పరికరాలను, రికార్డుల నిర్వహణ ను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి ఆరె సతీష్, పైలట్ మెరుగు శ్రీనివాస్ లు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News