Thursday, February 19, 2026

క్షయ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…:- సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కాలురి పెద్ద మస్తానయ్యా

నేటి సాక్షి 18 ఫిబ్రవరి ఆత్మకూరు :–ప్రపంచ క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలు నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు నంద్యాల జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టిబి కంట్రోల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూర్ టీ బి యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్ సార్ తెలిపిన విధంగా ఆత్మకూరు నందు గల గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ పి. దేవానందన్ మరియు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య వారి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి మైక్రో బ్యాక్టీరియంటుబర్క్లోసిస్ ద్వారా ఒకరి నుండి మరొకరికి ఎడతెరిపిలేని దగ్గు, దగ్గు తో పాటు గళ్ళ పడడం, దగ్గు తో పాటు రక్తం పడడం, సాయంత్రం జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, లాంటి లక్షణాలు కలవారు దగ్గరలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గళ్ళ పరీక్ష మరియు మెడికల్ ఆఫీసర్ గారితో పరీక్ష చేయించుకుని క్షయ అని నిర్ధారణ అయిన తర్వాత మెడికల్ ఆఫీసర్ గారు తెలిపిన విధంగా డాట్ సిస్టం ద్వారా నిర్ధారించిన మాత్ర లను సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోవడం వల్ల క్షయ పూర్తిగా నయం అవుతుంది. 56 రోజులకు ఒకసారి ఐపి గల్ల పరీక్ష తర్వాత 112లకు కంటిన్యూషన్ ఫేస్ గల్ల పరీక్ష చేయించుకుని పూర్తిగా నయమైనది తెలుసుకున్న తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేయించుకోవడం వల్ల క్షయ వ్యాధి పూర్తిగా నయం అవడమే కాకుండా మరలా రాదు అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ విధంగా కాకుండా ఒక క్షయ వ్యాధిగ్రస్తుని కి మందులు వాడించకపోతే ఒక సంవత్సరంలో 15 మందికి అదేవిధంగా రెండో సంవత్సరంలో 225 మందికి మూడో సంవత్సరంలో 4000 పైగా క్షయ వ్యాధిగ్రస్తులు ఏర్పడవచ్చు అందువలన నివారించడం చాలా కష్టమవును అందువలన ప్రతి లక్షణాలను త్వరగా గుర్తించడం, క్షయ వ్యాధి లక్షణాలను గల వారిని త్వరగా గళ్ళ పరీక్ష, చేయించడం. గళ్ళ పరీక్షలో క్షయ నిర్ధారణ అయినవారికి త్వరగా డాట్ సిస్టం ద్వారా మందులు మింగించడం వలన క్షయ వ్యాధిని నివారించడంలో ప్రతి ఒక్కరం తోడ్పడుతామని సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద వస్తానయ్య తెలియజేసినారు. స్కూల్ హెడ్మాస్టర్ పి. దేవానందన్ గారు ప్రతి ఒక విద్యార్థిని విద్యార్థులు క్షయ వ్యాధి నివారణలో విద్యార్థి పాత్రను పోషించి చేయవాది నివారణలో తోడ్పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News