నేటి సాక్షి,నల్లబెల్లి అక్టోబర్ : నల్లబెల్లి మండల సమాఖ్య కార్యాలయంలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కమిటీలకు నిర్వహణ మార్గదర్శకాల పై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి ఆర్ డి ఏ, నాన్ ఫారం డిపిఎం దాసు ముఖ్య అతిధులుగా హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనల ప్రకారం రైతు తెచ్చిన సన్న ధాన్యానికి (A గ్రేడ్) క్వింటాలుకు 2389 రూపాయలు. దొడ్డు రకానికి (C గ్రేడ్) 2369 రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అన్నారు. అలాగే ప్రతీ రైతు తాను తెచ్చే ధాన్యం తాలు, చెత్త, మట్టి లేకుండా, తేమ శాతం 17లోపు ఉన్న ధాన్యాన్ని తీసుకు రావాలన్నారు. కొనుగోలు కేంద్రాల లో ఈ రకమైన సౌకర్యాలు ఉండాలన్నారు. కేంద్రాలు అన్నీ నీరు నిల్వకుండా ఉన్న ప్రదేశంలో ఉండాలి. ఎగువ ప్రాంతం లో ఉండాలి. ఒక ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం లో ఉండాలి. మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. తత్కాలిక టాయిలెట్ ఉండాలి. కరెంట్ సౌకర్యం ఉండాలి. రవాణాకు సౌకర్య వంతం గా ఉండాలి అని చెప్పారు.అలాగే ప్రతీ రైతు హార్వెస్టర్ తో కోయించినప్పుడు మెషిన్ యొక్క RPM 18 నుండి 20 లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ప్రతీ సెంటర్ లో మహిళలే తప్పకుండా నిర్వహఉంచాలి అన్నారు. ప్రతీ రైతు తన యొక్క ధాన్యాన్ని తప్పకుండా ప్యాడీ క్లీనర్ ను ఉపయోగించి తాలు లేకుండా తూర్పార బట్టుకొని తేమశాతం 17 కు లోపు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అప్పుడు మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే గోనె సంచులు కేంద్రం నుండి బయటకు ఇవ్వకూడదు. రైతు తన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకు వచ్చినప్పుడు మాత్రమే, ఆ ధాన్యానికి AEO వ్యవసాయ అధికారి టోకెన్ ఇచ్చిన తర్వాత మాత్రమే గోనె సంచులు ఇవ్వబడతాయి అన్నారు. సెంటర్ నిర్వాహకులు తప్పని సరిగా తగిన రికార్డులు నిర్వహించాలి అన్నారు. నాణ్యతా ప్రమాణాలు,తేమ శాతం 17 లోపు,తాలు /చెత్త 1శాతం,మట్టి/రాళ్ళు 1శాతం,పక్వానికి రాని గింజలు 3శాతం,రంగు మారినవి/ మొలకెత్తినవి 5శాతం,మిశ్రమ గింజలు 6శాతం ఉండాలి అన్నారు.చివరిగా వారి ధాన్యం కొనుగోలు కమిటీ వారు అందరూ ఎటువంటి లోటు పాట్లకు తావు లేకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య కోశాధికారి మౌనిక, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, cc లుయాకుబ్,సాంబయ్య,వెంకట్,కవిత,సుజాత,దుగ్గొండి, నల్లబెల్లి మండలాల APM లు ఈద రమేష్,కందిక సుధాకర్ పాల్గొన్నారు.





